War
ఇరాన్ – అమెరికా మధ్య రెండు వారాల యుద్ధ విరమణ..
ఇరాన్ -అమెరికా మధ్య రెండు వారాల పాటు యుద్ధ విరమణ జరిగినట్లు ట్రంప్ తప సోషల్ మీడియా ట్రూత్ లో పేర్కొన్నారు. నిన్న రాత్రి జరిగిన దాడుల్లో ఇరాన్ ప్రజలు దేశ కోసం మానవహారంగా నిలబడిన తీరు గొప్పదని నిపుణులు అంటున్నారు. దీంతో ఆయిల్ ధరలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ భద్రతా మండలి స్పష్టం చేసింది. కాగా ఈ నెల 10న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, మాకు సంబంధించిన 10 డిమాండ్లను చర్చించడానికి యుఎస్ఎ ఒప్పుకుందని తెలిపింది. ఇరాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి మేం గెలిచాం అని సంబరాలు చేసుకుంటున్నారు.
![]()
