Connect with us

War

ఇజ్రాయిల్, అమెరికాలకు సింహస్వప్నంగా ఇరాన్..

Published

on

షాట్ న్యూస్ డెస్క్..

 

అమెరికా ఇరాన్ అణు శాంతి చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ ఆకస్మికంగా ఇరాన్ పై దాడి చేసి అహంకారం చూపించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 1979 అమెరికా తొత్తు ప్రభుత్వం ‘షా’ ను కూలదోసి ఇస్లామిక్ ప్రభుత్వం వచ్చిన 40 సంవత్సరాల నుంచి ఇజ్రాయిల్, అమెరికా లకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎలాగైనా ఇస్లామిక్ రెజ్యూమ్ ను దించాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందుకు కొన్ని అరబ్బు దేశాలు కూడా వంతం పాడాయి. చివరికి అణు చర్చలు జరుగుతున్న నేపధ్యంలో దాడికి దిగాయి. తమ ఇంటెలిజెన్స్ సంస్థలైన మొస్సాద్ మరియు సీఎఎ ద్వారా చేయవలసిన పనులు చేశాయి. వారం రోజుల్లో ఇరాన్ నాశనం చేసి రెజ్యూమ్ ను మార్చి తమ అనుకూల తొత్తు ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని ఇజ్రాయిల్ కన్న కలలు ఇరాన్ ప్రతికార దాడికి కల్లలై, కాకవికలంగా మారి, అమెరికా మద్దతు కోసం వెంపర్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా కూడా బిగ్ బి బాంబర్ల ద్వారా ఇరాన్ను భయపడేలా చేయాలనుకొని, అణు రియాక్టర్ల స్థావరాలపై దాడి చేసి ఫెయిల్యూర్ అయింది. ఎక్కడ తగ్గని ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా స్థావరాలపై వెంటనే దాడి చేసి అమెరికాకు చుక్కలు చూపించింది. ఒకవైపు ఇజ్రాయిల్ పై ఇరాన్ వేసిన క్షిపణులు టార్గెట్ లను ఛేదించి దిక్కు తోచని పరిస్థితిలో ఉంటే, మరోవైపు సూపర్ పపర్ అమెరికా బేస్ లపై దాడి చేసి, ట్రంప్ తోక ముడిచి, వెంటనే యుద్ద విరమణ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పన్నెండు రోజుల యుద్ధంలో ఇజ్రాయిల్ పూర్తిగా సర్వనాశనం అయి యుద్ద విరమణకు అమెరికా కు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయిల్ వ్యాప్తంగా ప్రస్తుతం వస్తున్న నివేదికలు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

 

ఈ యుద్ధంతో పూర్తిగా భంగపడిన సూపర్ పవర్ అమెరికా మరియు ఇజ్రాయెల్ లు ఎలాగైనా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్లీ ఇరాన్ పై దాడి చేసెందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ దశలో డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఇరాన్ యుద్దానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ ఒంటరిగా ఇరాన్ పై దాడికి దిగెందుకు భయపడుతుంది. మరోవైపు చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాలు తమ సరికొత్త టెక్నాలజీతో కూడిన యుద్ద సామాగ్రిని ఇరాన్ కు తరలిస్తున్నాయి. రష్యా నుంచి రావాల్సిన యుద్ద విమానాలు ఆలస్యం అవుతుండగా చైనా నుండి సరికొత్త టెక్నాలజీతో కూడిన 40 యుద్ద విమానాలు తరలించినట్లు సమాచారం అందుతుంది. ఇవియే గాక అమెరికా వరకు వెళ్లే లాంగ్ రేంజ్ క్షిపణులను ఇరాన్ తయారు చేసి పరిరక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు దేశ అవసరాలకు మాత్రమే అణు కార్యక్రమాన్ని చేస్తున్న ఇరాన్ తనపై దాడి మళ్లీ జరగకుండా అణు బాంబులను కూడా తయారు చేయబోతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు గాజాకు సంఘీభావం తెలుపుతూనే, ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలకు ఆయుధ సామగ్రిని అందిస్తూ..ఏదైతేనేం సూపర్ పపర్ గా ఉన్న అమెరికా, పాలస్తీనా ప్రజల నరమేధం చేస్తున్న దాని అనుంగ శిష్యుడైన ఇజ్రాయిల్ కు ఎదురెళ్లి ‘సై’ అని సింహస్వప్నంంగా నిలిచింది ఇరాన్. ఇరాన్ చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అరబ్బు దేశాలు, భారతదేశం నైతిక మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

షేక్ అబ్దుల్ రజాక్,

షాట్ న్యూస్ ఎడిటర్.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.