World
పాకిస్థాన్ జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బాంబు దాడి..
పాకిస్థాన్లో ప్రయాణికుల రైలుపై మరోసారి దాడి జరిగింది. క్వెట్టా వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన పేలుడులో కనీసం ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్లోని షికార్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రైలుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ రైల్వే స్టేషన్కు కిలోమీటరు దూరంలో ఉదయం 8:15 గంటల సమయంలో రైల్వే ట్రాక్పై దుండగులు అమర్చిన బాంబు పేలింది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈ పేలుడు సంభవించినట్లు షికార్పూర్ డిప్యూటీ కమిషనర్ షకీల్ అబ్రో ధృవీకరించారు.
![]()
