Connect with us

World

సిడ్నీలో కాల్పుల కలకలం.. సెక్యూరిటీ దుస్తుల్లో వచ్చి కాల్పులు.. 10 మంది మృతి

Published

on

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం (డిసెంబర్ 14) బీచ్ లో ఉన్న టూరిస్టులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది పర్యాటకులు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ దుస్తుల్లో షాట్ గన్స్ తో వచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న టూరిస్టులు భయంతో పరుగులు పెట్టారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్‌లో ప్రవేశించి పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పారిపోయే ప్రయత్నంలో ఓ దుండగుడు భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు. మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.