World
పాలస్తీనాకు గుర్తింపు ఇవ్వాలని ఇటలీలో భారీ నిరసనలు..
ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన నేపథ్యంలో.. అమెరికా, ఇజ్రాయెల్ వత్తిడితో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం అధికారిక గుర్తింపునివ్వక పోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు దేశవ్యాప్తంగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. సోమవారం మిలన్, రోమ్, వెనిస్, నేపుల్స్, జెనోవా తదితర 75 నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిరసనకారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ రోడ్లపైకి దూకడంతో, స్థానిక పోలీసులు వాళ్లను నిరోధించడానికి ప్రయత్నించడంతో హింసాత్మక ఘర్షణలు సంభవించాయి. నిరసనలు పలు ప్రాంతాల్లో తీవ్రంగా విస్తరించి ప్రజా వ్యతిరేకతకు దారితీసాయి. ఈ సంఘటనల నేపథ్యంలో ఇటలీ రాజకీయ వాతావరణంలో కూడా ఉద్రిక్తతలు ఏర్పడతాయని భావిస్తున్నారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ఇటలీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే పరిణామాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
![]()
