Connect with us

World

రియల్ హీరో అహ్మద్.. నెటిజన్ల ప్రశంసలు

Published

on

సిడ్నీ: సిడ్నీ బీచ్‌లో అమాయక యూదులపై ఇష్టారీతిగా తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాది సాజిద్ను సాహసోపేతంగా నిలువరించిన 43 ఏళ్ల అహ్మద్-అల్-అహ్మద్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ధైర్యసాహసాలతో సాజిద్ చేతుల్లోంచి తుపాకీ లాక్కుని పలువురి ప్రాణాలను అహ్మద్ కాపాడారంటూ అతడిని జనం వేనోళ్ల పొగుడుతున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒక్క ఉదుటున సాజిద్ పైకి దూకిన వైనం వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అతని ధైర్యసాహసాల గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.

దాడి జరిగినప్పుడు ఆదివారం ఉదయం అదే బాండీ బీచ్ అహ్మద్ తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన కాఫీ తాగుతున్నాడు. ఉగ్రవాది సాజిద్ అక్కడివారిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతుంటే అహ్మద్ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని ఎలాగైనా సాజిద్ను అడ్డుకుందామని నిశ్చయించుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడితో.. వాడిని అడ్డుకునేందుకు వెళ్తున్నా. ఒకవేళ నేను చనిపోతానేమో. నా కుటుంబాన్ని చూసుకో. అహ్మద్ ఎలా చనిపోయాడని నా వాళ్లు అడిగితే ప్రజల్ని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు అర్పించాడని చెప్పు” అని అనేసి వెంటనే రంగంలోకి దిగాడు. వెంటనే సాజిద్ వద్దకు చేరుకుని అతడి చేతిలోని పెద్దరైఫిల్ ని పెనుగులాట తర్వాత లాక్కుని సాజిద్కు రైఫిల్ను గురిపెట్టి అక్కడి నుంచి దూరంగా వెళ్లేలా చేసి, చాలా మంది ప్రాణాలను కాపాడారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.