World
నేటి తెల్లవారుజామున ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం! 7.4 తీవ్రత, సునామీ హెచ్చరిక జారీ…
ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్ లోని మిండావో ప్రాంతంలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, భూకంపం లోతు 62 మీటర్లు (38.53 మైళ్లు) స్థానిక అధికారులు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. అత్యవసర సేవలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని పౌరులను కోరారు. Institute of Volcanology and Seismology (Phivolcs) ప్రకారం, తొలి సునామీ అలలు అక్టోబర్ 10, 2025 ఉదయం 09:43: నుండి 11:43:54 (PST) మధ్య రావచ్చు. ఈ అలలు చాలా గంటల పాటు కొనసాగవచ్చని తెలిపారు.
![]()
