Connect with us

India

ప్రపంచ పటం నుండి ‘పాక్’ ను తొలగించేస్తాం.. ఆర్మీ చీఫ్ వార్నింగ్

Published

on

ఉగ్రవాదాన్ని పెంచి, ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్థాన్ మీద భారత్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్నిఇకనైనా ఆపకపోతే.. ఆ దేశం భౌగోళిక, చారిత్రక అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్లోని అనూప్లఢ్లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో మేము సహనాన్ని ప్రదర్శించాం. కానీ ఈసారి ఆ విధంగా ఉండదు. పాకిస్థాన్ మళ్ళీ రెచ్చగొడితే, ‘సిందూర్ 2.0’ రూపంలో గట్టిగా ఎదురుదెబ్బ తగలకుండా ఉండదు. భౌగోళిక చరిత్రలో నిలిచిపోవాలా లేదా అనే ప్రశ్న పాక్ ఆలోచించుకోవాలి. ప్రపంచపటంలో కొనసాగాలంటే, సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపాల్సి ఉంటుంది. లేకపోతే చరిత్రలో తమను తొలగించివేయాల్సి వస్తుంది ఇది స్పష్టమైన హెచ్చరిక” అని ఆయన అన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.