Connect with us

India

భారతీయ సేవా రత్న అవార్డు అందుకున్న డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో యోగదనం సహారా సమితి వారు భారత సేవా రత్న అవార్డును డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ప్రదానం చేశారు.

ఈ అవార్డు వేడుకలకు డాక్టర్ షేక్ మహబూబ్ వలికి స్పెషల్ గెస్ట్ గా ఇన్విటేషన్ పంపడంతో జైపూర్ వెళ్లి ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం మహబూబ్ వలీ యోగదనం సహారా సమితి ఆఫ్ ఇండియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కొన సాగుతున్నారు. ఈ అవార్డు షేక్ మహబూబ్ వలికి 111 వ అవార్డు కావడం గమనార్హం. షేక్ మహబూబ్ వలీ చేస్తున్న సమాజ సేవలను గుర్తించి ఆయనకు భారత్ సేవ రత్నా అవార్డును బహుకరించారు.

ఈ అవార్డును చీఫ్ జస్టిస్ నరేంద్ర కుమార్ జైన్ రాజస్థాన్ మాజీ జడ్జ్ మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం, DIG అనిల్ కుమార్ జైన్ మరియు మాజీ ఇండియన్ ఎయిర్ఫోర్ గ్రూప్ కెప్టెన్ రమేష్ చంద్ర త్రిపాటి మరియు సర్కిల్ ఇన్పెక్టర్ హరేంద్ర సింగ్ ఈ అవార్డును షేక్ మహబూబ్ వలికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి.. మాట్లాడుతూ ఈ అవార్డు ఎంపిక చేసిన యోగ్దానం సహర సమితి ఆఫ్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.