Connect with us

India

ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

న్యూఢిల్లీ: ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడిగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ పదవికి సంబంధించిన అధికారిక నియామక పత్రాలను కార్లతో మన్నేష్ తైమార్ – లేథై అంబాసిడర్ మరియు మిచెల్ లావు (పాపువా న్యూగినియా) రెండవ సెక్రటరీలు డాక్టర్ షేక్ మహబూబ్ వలికి అందజేశారు. అదే విదంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ప్రతిష్ఠాత్మక జాతీయ అశోక అవార్డును మాజీ విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ భారతదేశ మంత్రి మీనాక్షి లేఖ, 2018 టూరిజం మిస్ యూనివర్స్ ఇషికో తనూజా, భారత దేశ ప్రముఖ రెజ్లర్ నర్సింగ్ సింగ్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

డాక్టర్ షేక్ మహబూబ్ వలి చేస్తున్న సామాజిక విస్తృత కార్యక్రమాలకు గాను ఇప్పటివరకు 110 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. ఆయన నియామకం పట్ల రాజకీయ, సామాజిక వర్గాలు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.