India
వక్ఫ్ సవరణ 2025లోని కీలకమైన సవరణలపై సుప్రీం కోర్టు స్టే.. ముస్లిం సంఘాలు హార్షం
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే 2025 వక్ఫ్ చట్టాన్ని పార్లమెంటు చట్టం చేసినందున మొత్తం చట్టాన్ని కొట్టేసేందుకు నిరాకరించింది. అయితే, కొన్ని సమస్యాత్మకమైన నిబంధనలపై మాత్రం స్టే విధించింది. అయితే ఒక ఆస్తి.. ప్రభుత్వ ఆస్తి కాదా అని కలెక్టర్ నిర్ణయించే అధికారం, కనీసం ఐదు సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ చేయాలని అనుమతించే వక్ఫ్ సవరణ, వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులు ఎక్కువగా ఉండేలా సవరణ చట్టాలపై స్టే విధించింది. సవరణ చట్టం 2025లోని నిబంధనలపై స్టే విధించాలా వద్దా అనే దానిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి ఏజీ మసిహ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను ముఖ్యమైన ముస్లిం సంఘాలు హార్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారతదేశంలో 30 రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇవి మొత్తం 8.7 లక్షల ఆస్తులలో 9.4 లక్షల ఎకరాల భూమిని అవి నియంత్రిస్తున్నాయి. వాటి అంచనా మార్కెట్ విలువ రూ. 1.2 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ లెక్కన, భారతీయ రైల్వేలు, సాయుధ బలగాల తర్వాత వక్ఫ్ బోర్డు దేశంలో మూడొవ అతిపెద్ద భూ యజమాని. ఈ ఆస్తులను ముతవల్లిలు అని పిలిచే ట్రస్టీలు, బోర్డుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి ఉన్నందున ఈ సంస్థలు తరచుగా ఆస్తి వివాదాలు, వ్యాజ్యాలు, అక్రమ ఆక్రమణలు, జవాబుదారీతనం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంటాయి.
![]()
