India
మానవత్వం పరిఢవిల్లిన వేళ.. పంజాబ్ ప్రజలకు తోడుగా- నీడగా..
పంజాబ్ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా అకాల వరదలతో అతలాకుతలం అయి దాదాపు 13 జిల్లాలలో 10 వేల ఇండ్లు కొట్టుకొని పోవడం మరియు భారీగా ఆస్తి నష్టం, పశువుల నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పట్టించుకోకుండా పోవడాన్ని దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా పంజాబ్ ప్రజలు కోపం వ్యక్తం చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ముస్లిం సమాజం యావత్తు పంజాబ్ వరద బాధితులకు నిలబడి సహాయ సహకారాలు అందించారు. బియ్యం, గోధుమలు రూపంలోనే కాకుండా అన్ని రకాల వస్తువులను ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి అండగా నిలబడటం పంజాబ్ ప్రజల మనస్సులను దోచింది. ఇదే కాకుండా మదరస విద్యార్థులు రీలీఫ్ వర్క్ లో భాగంగా వారి నివాస ప్రాంతాల్లో పేరుకు పోయిన బురదను కూడా క్లియర్ చేస్తున్నారు. 80 సంవత్సరాల ముస్లిం మహిళ అయితే ఏకంగా తన బంగారు నగలు, డబ్బును పంజాబ్ ప్రజల రిలీఫ్ ఫండ్ కు పంపించడం గమనార్హం. ఈ మహిళే కాకుండా చాలా మంది డబ్బు, బంగారం, తమకు తఖత్తుకు సరిపడా సహాయ చేశారు.
ఒక్క దేశ భక్తులం అని చెప్పుకొని విర్రవీగే సంస్థ తప్ప ఇతర అన్ని మతాల, వర్గాల వారు మానవత్వంతో, భారతదేశం గర్వించదగ్గ తరహాలో మనమంతా భారతీయులమే అనే తరహాలో మతాలు, వర్గాలకు అతీతంగా పంజాబ్ ప్రజల సహాయ సహకారాల్లో పాలుపంచుకున్న తీరు ప్రశంసనీయం.
భయానక వరదలు వచ్చి పంజాబ్ ప్రజలు తల్లడిల్లుతుంటే, పంజాబ్ ప్రజలు ఈ దేశ పౌరులే కానట్టు కేంద్ర ప్రభుత్వ అధినాయకత్వం, యంత్రాంగం పట్టించుకోకుండా పోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మన దేశ సైనికుల్లో అధిక శాతం ముఖ్యపాత్ర పోషిస్తూ.. వేల టన్నుల బియ్యాన్ని పండిస్తూ మన దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగం తీవ్రంగా ఇబ్బందుల్లో ఉంటే పట్టి పట్టనట్లు వ్యవహరించిన తీరు చాలా హేయమైనది. మణిపూర్ ఘర్షణలు జరిగి వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులై, వందలాది మంది మరణిస్తే పట్టించుకోకుండా పోయిన ప్రభుత్వం, ‘ఒకే దేశం- ఒకే ప్రజా ‘ అనే నినాదం మాటలకేనా అనే మీమాంస కలుగకమానదు. అధికారంలొ ఎవరు ఉన్నా భారత దేశంలో ఉండే అన్ని మతాల, వర్గాల ప్రజలు మన భారతీయులే అనే అంశం మాటలతో కాదు చేతలతో చూపించాల్సిన అవసరం ఉంది..
జైహింద్,
షేక్ అబ్దుల్ రజాక్,
ఎడిటర్, షాట్ న్యూస్.
![]()
