India
బిజేపి డబుల్ ఇంజన్ యూపిలో గోవులను వధిస్తున్న ముఠా అరెస్టు..
UP: ప్రస్తుతం గోదీ మీడియా మరియు సంఘ పరివార్ సమాజంలో ఏ చిన్న సమస్య జరిగిన ముస్లింలే కారకులు అనే విధంగా ప్రజలు మనస్సులను విష పూరితం చేయడం ఆనవాయితీగా చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ జరిగిన సంఘటనలో ఆవులను వధించి మార్కెట్లో అమ్మే వారందరూ హిందువులే అని తేలింది.
ఈ సంఘటన చేసిన వారు ముస్లింలే అయితే కఠినమైన ఊపా తదితర చట్టాలు పెట్టడమే కాకుండా, గోదీ మీడియా వారిని దేశ ద్రోహులుగా చేసి ప్రపంచమంతా చాటి అపఖ్యాతి పాలు చేసేది. ఇది జరిగింది ఎక్కడో కాదు బిజేపి డబుల్ సర్కార్ అయిన యూపి రాష్ట్రంలో. అదీ బుల్డోజర్ చరిత్ర గల సీయం యోగి సర్కార్ లో, ఇంత జరుగుతున్నా ఉత్తరప్రదేశ్ గో రక్షకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారనేది ప్రశ్న..?
యూపీ రాష్ట్రంలో ఆవులను దొంగిలించి వధించి విక్రయిస్తున్న 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 14 ఆవులను చంపినవి మరియు 48 బతికి ఉన్న ఆవులు దొరికాయి. దొరికిన వారిలో రఘుబీర్ బంజారా, హ్యాపీ సెంగర్, శివ భడోరియా, దీపక్ జాతవ్, మంజేష్ యాదవ్, రాహుల్ సింగ్, రాహుల్ చౌహాన్, రాహుల్, బబ్లు, విక్రమ్, అర్జున్, కల్లు, ముఖేష్ మరియు నైనా, కల్లు, బచ్చు అనే ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
![]()
