India
‘ఓట్ చోర్’ అనే పదం వాడొద్దు..ఈసి రాహుల్ గాంధీకి సూచన
‘ఓటు చోర్’ అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నిక కమిషన్ పై పోరాటానికి రాహుల్ తోపాటు ప్రతిపక్షానికి సరైన ఆయుధం లభించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఆందోళనలకు ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. అయితే తన ఉద్యమానికి రాహుల్ ‘ఓటు చోర్’ అని నామకరణం చేయడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. అదో నీచ పదం.. వాడొద్దు ప్లీజ్ అంటూ ప్రతిపక్ష నేతకు సూచించింది. దీంతో రాహుల్ చేపట్టిన ఉద్యమం ఎన్నికల కమిషన్ పై ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తుందో అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ కేంద్రం, ఎన్నికల కమిషన్ ను ఇరుకన పెట్టేందుకు ఓటు చోర్ ఉద్యమాన్ని సరైన అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. బిహార్ లో ఈ ఏడాది నవంబరులో ఎన్నికలు జరగనుండగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ఈసీ చేపట్టింది. దాదాపు 7.5 కోట్ల ఓట్లలో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించింది. అయితే ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి అర్హుల ఓటర్లు తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
![]()
