World
ఘోరం.. యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగి 70 మంది దుర్మరణం
సనా: యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోయిన ప్రమాదంలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ మంగళవారం వెల్లడించింది. సోమాలియా, ఇథియోపియాలకు చెందిన 260 మందితో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్ దక్షిణ తీరంలో తీవ్రమైన గాలులతో సముద్రంలో బోల్తా పడటంతో మునిగిపోయిందని పేర్కొంది.
![]()
