Connect with us

World

రష్యాలో మరోసారి భూకంపం..

Published

on

రష్యాలో ఒకవైపు భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనం కల్లోలం రేపుతున్నాయి. ఆదివారం కురిల్ దీవులలో సంభవించిన శక్తివంతమైన భూకంపం, సమీపంలోని కచ్చట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ప్రకృతి శక్తి విరుచుకుపడటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS), జపాన్ వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, రష్యా కురిల్ దీవుల తీరంలో రిక్టర్ స్కేల్పై 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూమి గర్భంలో దాదాపు 60 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిన ఈ భూకంపం, తీర ప్రాంతాల్లో బలంగా అనిపించింది. భూకంపం ప్రభావంతో భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.