India
జైలు నుంచి విడుదలైన నిర్దోషులకు నష్టపరిహారం చెల్లించాలి:MM.ఖాన్
న్యూఢిల్లీ: 2006 జూలై 11న ముంబయిలో జరిగిన ట్రైన్ పేలుళ్ల కేసులో అరెస్టయిన 12 మంది నిర్దోషులుగా విడుదలైన విషయంపై జమాఅతె ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు మలిక్ మోతసిమ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 మంది సుమారు 19 సంవత్సరాలు జైలు జీవితం అన్యాయంగా గడిపారుఅని,అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “బాంబే హైకోర్టు 671 పేజీల తీర్పులో పరిశోధన లోపాలను, ఆధారాల లోపాలను బట్టబయలు చేసింది. దర్యాప్తు, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఆ తీర్పు స్పష్టంగా చూపుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులోకి వెళ్లడం అనవసరమైన చర్య అవుతుంది” అని ఆయన అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ
“ఈ 12 మంది నిర్దోషులపై అనేక సంవత్సరాలుగా అన్యాయం జరిగింది. వారు జైళ్లలో శారీరక, మానసిక హింసలకు గురయ్యారు. వారి కుటుంబాల జీవితాలు చిద్రమయ్యాయి. నిజమైన నిందితులు ఇప్పటికీ బయటే వున్నారు. ధ్వంసకారుల్లో 189 మంది మరణించారు, 800 మందికిపైగా గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టులోకి వెళ్లడం కంటే కొత్తగా, సమగ్రంగా దర్యాప్తు ప్రారంభించి అసలైన నిందితులను పట్టుకోవాలి.”అంతేకాదు, న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేశారు. “దెబ్బతిన్నవారికి నష్టపరిహారం ఇవ్వాలి. తప్పుల్ని పునరావృతం కాకుండా చూడాలి. భవిష్యత్‌లో విచారణలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మలిక్ మోతసిమ్ ఖాన్ అన్నారు
.
![]()
