Connect with us

India

‘మిమ్మల్ని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారు?’..ED పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు..

Published

on

ఢిల్లీ:- మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల అక్రమ కేటాయింపులో కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి బైరతి సురేష్‌లపై జారీ చేసిన సమన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఇడి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి నిరాకరించిన ధర్మాసనం సోమవారం (జూలై 21) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను “రాజకీయ కక్షసాధింఫూ పోరాటాలకు” ఎందుకు భాగమవుతున్నారని ప్రశ్నించింది. “మిస్టర్ రాజు, మేము ED గురించి కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది. దురదృష్టవశాత్తు, నాకు మహారాష్ట్రలో కొంత అనుభవం ఉంది. మీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ హింసను కొనసాగించదలిచారా. రాజకీయ యుద్ధాలను ఓటర్ల ముందు జరగనివ్వండి. ఈడీ ని ఎందుకు ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు…” అని CJI గవాయ్ అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజుతో అన్నారు. విధానంలో అనుసరించిన తార్కికంలో మాకు ఎటువంటి లోపం కనిపించడం లేదు. కేసు యొక్క విచిత్రమైన వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా, మేము పిటిషన్ ను తోసిపుచ్చుతున్నాము” అని ధర్మాసనం పేర్కొంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.