India
ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధులు జమ..!
ఢిల్లీ: రైతన్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున గుడ్ న్యూస్. ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధుల విడుదల తేదీ దాదాపు ఖరారైంది. దేశంలోని రైతులకు అందించే పీఎం కిసాన్ యోజన 20వ విడత సహాయ నిధులు ఆగస్టు 2న అన్నదాతల అకౌంట్లో జమ కానున్నాయి. పీఎం నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ఆగస్టు 2న ఉండగా.. ఆరోజు జరిగే బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. కాగా గతంలో కూడా ప్రధాని వారణాసి పర్యటనలో ఉన్నపుడే 17వ విడత నిధులు విడుదల చేసారు. అయితే కేంద్రం ఇవ్వనున్న రూ.2 వేల సహాయంతోపాటు ఏపీ కూటమి ప్రభుత్వం అందజేయనున్న రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు కూడా ఆరోజే ఏపీ రైతుల అకౌంట్లో జమ కానున్నట్టు సమాచారం.
![]()
