India
బాలివుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత… ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు భార్యలు హేమ మాలిని, ప్రకాష్ కౌర్, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కుమార్తెలు ఇషా డియోల్, అహానా డియోల్ ఉన్నారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు.
హీ మ్యాన్ గా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ధర్మేంద్ర మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన మరణం పట్ల బాలీవుడ్ కు చెందిన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు సంతాపం తెలిపారు. ఈ తెల్లవారు జాము నుంచి ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని. లైఫ్ సపోర్ట్ చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు.
![]()
