India
జాతీయ స్థాయిలో ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే విద్యార్థిని జోయ సిద్ధిఖి విజయకేతనం..
ఇండోర్: ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థిని షేక్ జోయా సిద్ధిఖీ 69వ జాతీయ పాఠశాల కరాటే ఆటల పోటీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని డాలీ కాలేజ్ లో డిసెంబర్ 15వ తేదీ అనగా నేడు జరిగిన 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలలో గర్ల్స్ అండర్ 14 ఇయర్స్ – 50 kgs విభాగంలో షేక్ జోయాసిద్ధిఖి ఆంధ్రప్రదేశ్ తరపున 3rd ప్లేస్ సాధించిందని మార్కాపురం ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ చీఫ్ ఎగ్జామినర్ ఎం శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న షేక్ జోయసిద్దిఖి పేద కుటుంబం నుంచి పట్టుదలతో ఈ స్థాయికి చేరింది. ఈ విద్యార్థిని తండ్రి షేక్ మలిక్ బాషా ఏసి టెక్నిషియన్ గా పనిచేస్తుండటం గమనార్హం.
![]()
