Connect with us

India

టెర్రరిజాన్ని మతాలకు అంటగట్టడం మాని.. దేశ ద్రోహులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి..

Published

on

SHOT NEWS DESK: ఈ మధ్య కాలంలో నవంబర్ 10 ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత భారత్ లో టెర్రరిజంకు సంబంధించిన మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి పంజాబ్ కేంద్రంగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఏఎస్ తో కుమ్మక్కు అయి డ్రోన్స్ ద్వారా భారత్ లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపిణీ చేసే గ్రూప్, రెండోది ఈ ఆయుధాలను దేశంలోని పలు ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్న గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా, మూడోది మన దేశ నేవీకు సంబంధించిన సీక్రెట్స్ లను ఐఏఎస్ కు సమాచారం పంపే నేవి అధికారులు.

ఈ మూడు సంఘటనలను మన దేశ బధ్రతా దళాలు చేధించి బయటపెట్టాయి. అయితే ఈ మూడు ఘటనల్లో దొరికిన వారంతా హిందూవులే.. ఈ విషయాలు మెయిన్ మీడియా స్ట్రీమ్ లోకి రాకపోవడం గమనార్హం. దేశంలో ఏ టెర్రరిజం సంఘటన జరిగిన ముందుగా అనుమానం చూపులు ముస్లిం సమాజంపై వేయడం ఇటు ప్రభుత్వానికి, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అలవాటై పోయింది. దేశానికి ద్రోహం చేసిన వారు ఏ మతానికి చెందిన వారైనా ఒకేలా ట్రీట్ చేయడం మాని ఒకవైపు మాత్రమే అనుమానపు చూపులు చూడటం చాలా దుర్మార్గం. ఢిల్లీ బ్లాస్ట్ లో పాల్గొన్న వారంతా ముస్లింలే అని దుమారాన్ని లేపిన మెయిన్ మీడియా, ఆ తర్వాత NIA ఇన్వెస్టిగేషన్ లో వారిని నిర్దోషులుగా తేల్చారు.

ప్రభుత్వాలు ఏవైనా తమ చేతగాని తనాన్ని దాచెందుకు ఎవరినో ఒకరిని బలి చేయడం అలవాటైపోయింది. దేశంలో ఇప్పటికే వందల కొలది టెర్రరిజం కేసుల్లో వేలాది మంది అమాయక ముస్లింలను అరెస్టు చేసి వారిపై దేశ ద్రోహం కేసులు వేసి సంవత్సరాలుగా వారిని జైళ్లలో మగ్గేలా గురి చేయడం, ఆ తర్వాత కోర్టులు వారిని నిర్దోషులుగా తేల్చడం నిత్యకృత్యం అయింది. దేశ సర్వభౌమాత్యానికి, దేశద్రోహం చేసిన వారు ఏ మతానికి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి. కాని ఒక మతానికి చెందిన వారిపై అనుమానం, నిందలు వేయడం మానాలి. అప్పుడే దేశ సమగ్రతను కాపాడగలం. ఇదే విషయాన్ని చాలా మంది మేధావులు చెప్పిన విషయం గమనార్హం.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.