India
కేరళ, యూపీలో SIRకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు- ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు..
ఢిల్లీ: కేరళ, ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.
కేరళలో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేసిన పిటిషనర్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని, అందువల్ల ఎస్ఐఆర్ విషయంలో అత్యవసర విచారణ అవసరం అని వాదించారు. దీనితో కేరళలో ఎస్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 26న విచారణ జరిపనున్న సర్వోన్నత న్యాయస్థానం.
అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్లను డిసెంబర్ లేదా రెండో వారంలో విచారణ ఆమోదించింది. వాస్తవానికి దేశంలో ఎస్ఐఆర్ నిర్వహించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ చేస్తోంది. ఇక నవంబర్ 11న, తమిళనాడు, బెంగాల్లో ఎస్ ఐఆర్ నిర్వహణను సవాల్ చేస్తూ డీఎంకే, సీపీఎం, పశ్చిమ్ బెంగాల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు దాఖలు చేశారు. పిటిషన్లపై సుప్రీంకోర్టు, ఎన్నికల కమీషన్ నుంచి ప్రస్తుతం స్పందనలు కోరింది.
![]()
