India
బీహార్ లో పదవసారి ముఖ్యమంత్రిగా ప్రామాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్..
పాట్నా: బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హాలు ప్రమాణస్వీకారం చేశారు. వీరితోపాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీనడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లు పాల్గొన్నారు.
![]()
