India
దేశ ప్రజలందరి ఐక్యతతోనే టెర్రరిజాన్ని ఎదుర్కోగలం.. దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీడియో వైరల్
భారతదేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సాహిస్తున్న ఐఏఎస్ దేశంలో ముస్లింల కన్న హిందువులనే టార్గెట్ చేసుకుని పనిచేస్తుందని భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.
ఆయన ఇండియా, ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ సమ్మిట్ లో చేసిన ప్రసంగం వీడియోలో 1947 స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నాలుగు వేలకు పైగా టెర్రరిస్టు యాక్టివిటీస్ జరిగాయని, అందులో ఐఏఎస్ ప్రోద్బలంతో జరిగిన సంఘటనల్లో ముస్లింలు 20 శాతం, హిందూవులు 80 శాతం మంది పాల్గొన్నారని, అలాగే ఇండియాలో ఇస్లామిక్ పండితులు, మేధావులు చాలా వరకు టెర్రరిజానికి వ్యతిరేకంగా ముస్లింలలో ప్రచారం నిర్వహిస్తున్నారని, హిందూమత పండితులు ఆ దిశగా పెద్దగా పనిచేయడంలేదని, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత విద్వేషాలను విడనాడి కలిసి మెలిసి జీవించాలని, ముస్లింలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రేరిత టెర్రరిజాన్ని దేశ ప్రజలందరి ఐక్యతతోనే సాధించగలమని అన్నారు. అయితే ఈ వీడియో వైరల్ గురించి ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఇది 11 సంవత్సరాల క్రితం ఒక సమ్మిట్ లో చేసిన ప్రసంగం అని తేలింది.
ఏది ఏమైనా భారత దేశ హితం, సార్వభౌమాధిత్వం కోసం.. దేశ స్వాతంత్య్రం కొరకు కుల, మతాలకు అతీతంగా పోరాడి విజయం సాధించినట్లు, అదే విధంగా ఇప్పుడు కూడా అందరూ ఏకతాటిపై ఉండి టెర్రరిజాన్ని ఎదుర్కోవాలని మేధావులు సూచిస్తున్నారు.
![]()
