India
డాక్టర్ APJ అబ్దుల్ కలాం అవార్డు అందుకున్న మార్కాపురానికి చెందిన GMR హైస్కూల్..
హైదరాబాద్: LEAD INDIA FOUNDATION అనే సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లో అత్యుత్తమ విద్యనందిస్తూ విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషిచేస్తున్న అత్యుత్తమ స్కూల్స్ కు అందించే ప్రతిష్టాత్మక డాక్టర్ A. P. J.అబ్దుల్ కలాం అవార్డు ఈ సంవత్సరం GMR హైస్కూల్ ను వరించింది.
ఈ అవార్డును హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జి.యం.ఆర్. హై స్కూల్ కరెస్పాండెంట్ జి. మల్లికార్జున రెడ్డి అందుకున్నారు. అవార్డు తీసుకున్న అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ జి. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. జి.యం.ఆర్. హై స్కూల్ కు డాక్టర్ A. P. J. అబ్దుల్ కలాం అవార్డ్ రావడం గర్వకారణం అని, అలాగే ఈ అవార్డ్ సాధించుటకు నిరంతరం కృషి చేసిన అధ్యాపక బృందాన్ని కొనియాడారు.
![]()
