Connect with us

India

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం.. ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్..

Published

on

డిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా కలవరపాటుకు గురయ్యారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలోభాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐపైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం తన విచారణను కొనసాగించారు. ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.