Connect with us

India

మహబూబ్ వలికు కర్నాటక అచీవర్ అవార్డు ప్రదానం..

Published

on

బెంగళూరు: కర్ణాటక అచీవర్ అవార్డు అందుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పెద్దారవీడు త్రిపురాంతకం మండలాల పరిశీలకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి. ఈ అవార్డు కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలోని హయత్ సెంటర్ హుబ్బెల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్యారడైజ్ గ్రూప్స్ సంస్థల యజమాని వీరభద్రా చారి మరియు కన్నడ హీరోయిన్ సంగీత శృంగేరి ఈ అవార్డును షేక్ మహబూబ్ వలీకు ప్రధానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మహబూబ్ వలీ మాట్లాడుతూ.. దేశ భద్రతకు సంబంధించి నేను చేసిన సేవలకు గాను ఈ అవార్డును ప్రధానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో నాకు సమాజంపైన ఇంకా బాధ్యత పెరిగిందని.. నాకు శాయశక్తులా దేశం మరియు సమాజం హితం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో మంచి పేరు గడించిన షేక్ మహబూబ్ వలీకు ఈ అవార్డు అందుకున్నందుకు పలువురు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.