Connect with us

India

రెండు పింఛన్లు పొందుతున్న జాబితాలో అశోక్ గజపతి రాజు, చిరంజీవి

Published

on

మాజీ ప్రజాప్రతినిధుల కొటాలొ ఏపి నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి జాబితాను ఆర్టిఐ ద్వారా సేకరించింది ఓ సంస్థ. మాజీ ఎమ్మెల్యేలు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. మాజీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను ఆరా తీసింది ఆ సంస్థ. అయితే ఇలా రెండు చోట్ల పింఛన్లు తీసుకున్న వారిలో ప్రముఖులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారు. తరువాత మెగాస్టార్ చిరంజీవి, టీజీ వెంకటేష్, నాదెండ్ల భాస్కరరావు.. ఇలా ప్రముఖులంతా రెండు ప్రభుత్వాల వద్ద పింఛన్లు పొందుతున్న వారే. అయితే అది నేరమని చెప్పలేము కానీ.. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు రెండు చోట్ల పింఛన్లు తీసుకోవడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. అదే సమయంలో ప్రభుత్వాలు ఇటువంటి వాటి విషయంలో మార్పులు తీసుకొస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రముఖులంతా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారే. ఈ పింఛన్ అనేది వారికి చాలా చిన్న మొత్తం. వారికి తెలియకుండానే జరిగిపోయి ఉండవచ్చు. సాధారణంగా మాజీలుగా మారిన తర్వాత చాలామందికి ఇలా పింఛన్లు కొనసాగుతుంటాయి. అయితే ఇటువంటి ప్రముఖులు ఒకచోటే పింఛన్ తీసుకుని మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.