Connect with us

India

ప్రశ్నించే గొంతుక.. జైల్లో 8వ పుట్టిన రోజు

Published

on

నాగపూర్ కు చెందిన అత్యంత ప్రతిభావంతుడైన న్యాయవాది, తన అద్భుత వాదనా పటిమతో ఎందరో ఆదివాసులను, దళితులను అక్రమ కేసుల నుంచి విడిపించిన ప్రజా న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ పుట్టినరోజు ఇవాళ. ఆయన ఈ పుట్టినరోజును ముంబాయిలోని తలోజా జైలులో జరుపుకుంటున్నారు. జైలులో ఆయన జరుపుకుంటున్న ఎనిమిదో పుట్టినరోజు ఇది. భీమా కోరేగాం – ఎల్గార్ పరిషత్ అనే అబద్ధపు కేసులో నిందితుడిగా 2018 జూన్ 6న ఆయనను అరెస్టు చేశారు. ఏడు సంవత్సరాల రెండు నెలలుగా ఆ కేసు విచారణా లేదు, బెయిలూ లేదు. ఇలాంటి వారు వందల మంది జైల్లో ఉండటం గమనార్హం.

ఇదీ ఈ దేశంలో ప్రశ్నించే గళాలకు, అక్రమాలను నిలదీసే గళాలకు దక్కుతున్న సత్కారం! ఇదీ “ప్రజాస్వామిక” “చట్టబద్ధ” పాలన!!

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.