India
గాజాలో మానవ సంహారాన్ని నిలువరించండి..JIH జాతీయ అధ్యక్షులు హుస్సేని పిలుపు
⊄న్యూఢిల్లీ: జమాతే ఇ ఇస్లామీ హింద్ (జెఐహెచ్) జాతీయ అధ్యక్షుడు సయ్యద్ సదాతుల్లా హుస్సేనీ గాజాలో జరుగుతున్న మారణహోమం మరియు మానవతా విపత్తును తీవ్రంగా ఖండించారు. భారత ప్రభుత్వం, ప్రపంచ శక్తులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతా వాదులు అణచివేతకు వ్యతిరేకంగా లేచి, కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడిని ఆపడానికి వెంటనే చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “1.1 మిలియన్లకు పైగా పిల్లలు సహా 2.1 మిలియన్లకు పైగా పాలస్తీనియన్లలను నిరంతర బాంబు దాడులలో నరమేధం చేస్తుండటం దుర్మార్గమని, మార్చి 18, 2025న కాల్పుల విరమణ విఫలమైనప్పటి నుండి, ఇజ్రాయెల్ తన సైనిక దురాక్రమణను తీవ్రతరం చేసి నిత్యావసరాలపై పూర్తి దిగ్బంధనను కొనసాగిస్తూ.. గాజా ప్రజలు ఆకలితో అలమటించేలా, వారి ఇళ్ళను ధ్వంసం చేస్తున్నాయని, ఎలాగైనా ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా ప్రజలను పూర్తిగా నిర్మూలించే ప్రణాళికతో ముందుకు వెళుతుందని, రాబోయే విపత్తును ఆపడానికి ప్రపంచం ఇప్పుడు తక్ణణ చర్య తీసుకోవాలి అని అన్నారు.”
“గాజాలో ఇప్పటికే 660,000 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారని మరియు 17,000 పిల్లలు అనాథలుగా మారారని UNICEF నివేదిస్తున్నందున, ఇజ్రాయిల్ ముట్టడిని ఎత్తివేయకపోతే.. సెప్టెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయి కరువు ఏర్పడి మానవ సంహారం జరగే అవకాశం ఉంది,” అని ఆయన అంతర్జాతీయ సమాజానికి సూచించారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా దాని మిత్ర దేశాలు ద్వంద్వ వైఖరిని విడనాడి యుద్ద విరమణ చేయించాలని కోరారు.
భారత ప్రభుత్వం దృఢమైన మరియు సూత్రప్రాయమైన వైఖరిని తీసుకోవడం ద్వారా తన చారిత్రక మరియు నైతిక బాధ్యతను నిలబెట్టుకోవాలని హుస్సేని కోరారు. “భారతదేశం ఎల్లప్పుడూ పాలస్తీనా న్యాయమైన లక్ష్యానికి మద్దతు ఇస్తున్నందున, ఈ క్లిష్టమైన సమయంలో, మనం ఎప్పుడూ లేనంత స్పష్టంగా వారికి వెన్నంటి ఉండాలని, ఇజ్రాయెల్ అకృత్యాలను భారత ప్రజలు శాంతియుత ప్రతిఘటనలో చురుకుగా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.” అలాగే ఇజ్రాయెల్ ఉత్పత్తులను మరియు ఈ మారణహోమంలో భాగస్వాములైన కంపెనీలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
![]()
