Connect with us

India

ఓట్లను తీసేసి, పౌరసత్వాన్ని ఎసరు పెట్టె ప్రయత్నం మానాలి.. ఓవైసీ

Published

on

బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఈ ప్రక్షాళన ప్రక్రియ సమయం, దాని అమలు తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అగమేఘాల మీద ఈసీ చేయాలనుకుంటున్న ఈ తొలగింపుల వల్ల వేలాది మంది.. ముఖ్యంగా పేదలు, సరైన పత్రాలు లేని వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. ఓటు హక్కు మాత్రమే కాకుండా వారి పౌరసత్వం కూడా గల్లంతు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఆందోళనను స్పష్టం చేస్తూ.. కొందరు వ్యక్తులు నిజంగా అక్రమ వలసదారులే అయితే వారికి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ల హస్తం ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుట్రపూరిత చర్యల ద్వారా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ఓటర్లను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని లేదా గడువును పొడిగించాలని ఏఐఎంఐఎం ఈసీఐని కోరింది.బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఈ ప్రక్షాళన ప్రక్రియ సమయం, దాని అమలు తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అగమేఘాల మీద ఈసీ చేయాలనుకుంటున్న ఈ తొలగింపుల వల్ల వేలాది మంది.. ముఖ్యంగా పేదలు, సరైన పత్రాలు లేని వలస కార్మికులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. ఓటు హక్కు మాత్రమే కాకుండా వారి పౌరసత్వం కూడా గల్లంతు అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన ఆందోళనను స్పష్టం చేస్తూ.. కొందరు వ్యక్తులు నిజంగా అక్రమ వలసదారులే అయితే వారికి 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రక్రియ వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ల హస్తం ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కుట్రపూరిత చర్యల ద్వారా ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ఓటర్లను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని లేదా గడువును పొడిగించాలని ఏఐఎంఐఎం ఈసీఐని కోరింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.