Connect with us

India

ప్రముఖ ఆలయ ప్రాంగణంలో శవాల గుట్టలు.. 20ఏళ్లుగా అత్యాచారం, హత్యలు..

Published

on

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకాలో నెత్రావతి నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ ధర్మస్థల ఆలయంలో 20 ఏళ్లుగా దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యాచారం, హత్య చేస్తూ మృతదేహాలను పాతిపెట్టడం, కాల్చడం జరుగుతోందని మాజీ సానిటేషన్ కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. పవర్ ఫుల్ వ్యక్తుల ఆదేశాల మేరకు ఈ పనులు చేసినట్లు పేర్కొన్నాడు. ఇందులో మైనర్ బాలికలతో సహా అనేక మంది బాధితులు ఉన్నారని ఆరోపించాడు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇటీవల ఓ మృతదేహాన్ని తవ్వి బయటకు తీసినట్లు సమాచారం. కాగా ఈ చర్య ఆలయంలో జరిగిన దుష్కర్మలకు ఆధారంగా చూపబడింది. శానిటేషన్ కార్మికుడు ధర్మస్థల పోలీసులు, దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా తన జీవితానికి ముప్పు ఉందని భావించి, ఈ మాజీ కార్మికుడు పోలీసు రక్షణ కోరాడు. 2014లో ఈ ఘటనల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను.. ఇటీవల తిరిగి వచ్చి ఈ ఆరోపణలను బహిర్గతం చేశాడు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.