India
తమిళనాడు సీఎం అభ్యర్థిగా విజయ్ ను ఎన్నుకున్న టివికే పార్టీ..
రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్ ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. బిజేపి, కాంగ్రెస్ కూటమి కు సమదూరం పాటిస్తూ ప్రజలకు చేరువ అవుతున్న విషయం తెలిసిందే.రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్ ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు. బిజేపి, కాంగ్రెస్ కూటమి కు సమదూరం పాటిస్తూ ప్రజలకు చేరువ అవుతున్న విషయం తెలిసిందే.
![]()
