Connect with us

India

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్

Published

on

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ 171 బోయింగ్ విమానం టేకాఫ్ తర్వాత వెంటనే కుప్పకూలడంతో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని షాక్ కు గురయ్యేలా చేసింది. దీనిపై భారత్ తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాల ప్రధానమంత్రులు సైతం స్పందించారు. ఈ నేపథ్యంలో అసలు ఫ్లైట్ కుప్పకూలడానికి కారణమేంటి ? చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ కాగానే ఎయిర్ ఇండియా విమానం కిందకు పడిపోవడం ప్రారంభించింది. దీంతో పైలట్ సుమిత్ సభర్వాల్ వెంటనే స్పందించి అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు మేడే కాల్ చేశాడు. ప్రాణాపాయం వంటి తీవ్ర పరిస్ధితుల్లో ఉన్నప్పుడు మాత్రమే చేసే ఈ మేడే కాల్ ఇప్పుడు మొత్తం ప్రమాదానికి కీలకంగా మారింది. కేవలం ఐదు సెకన్ల ఈ మేడే కాల్ తర్వాత విమానం పక్కనే ఉన్న మేఘానీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది.అయితే ఈ ఐదు సెకన్ల మేడే కాల్ లో పైలట్ సుమిత్ సభర్వాల్ ఏటీసీకీ ఏం చెప్పాడనేది కేసు విచారణలోనూ కీలకంగా మారింది. ఈ ఐదు సెకన్ల కాల్ లో అతను మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. కిందకు పడిపోతోందంటూ ఏటీసీకి తెలిపాడు. ఆ తర్వాత ఈ విమానం కుప్పకూలిపోవడం, ఇందులో ప్రయాణిస్తున్న తనతో పాటు 242 మంది, మెడికల్ కాలేజ్ లో 25 మందికి పైగా చనిపోయారు. దీంతో ఈ మేడే కాల్ లో అతను చెప్పిన దానిని బట్టి కుప్పకూలడానికి ముందు ఆ విమానంలో అన్ని వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయినట్లు తేలిపోయింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.