Connect with us

India

ముంబాయిలో MPJ నేషనల్ కో ఆర్డినేషన్ సమావేశం..

Published

on

ముంబై: 29 సెప్టెంబర్ 2025 సోమవారం ముంబైలో జాతీయ నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం కన్వీనర్ సయ్యద్ సిరాజ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రాల వారీగా రిపోర్ట్, సమిక్ష జరిగింది. అలాగే యంపిజే జాతీయ స్థాయిలో విస్తరణపై విస్తృత చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో యంపీజే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు.. షేక్ అబ్దుల్ రజాక్, షేక్ సలీం, అబ్దుల్ అజీజ్, షకీల్, సయ్యద్ సిరాజ్, అఫ్సర్ ఉస్మాని, హెచ్ జి హఖ్, సయ్యద్ అలీ, డాక్టర్ ఫజల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో మతోన్మాదం నిర్మూలనం, అవినీతిని అంతమోందించడం, అమాయకులను జైళ్లలో నిర్భంధం, అందరికీ న్యాయం అందాలని, ప్రభుత్వాలు సంక్షేమ పధకాలను అవినీతి లేకుండా ప్రజలు చెంతకు చెందేలా చూడాలని తీర్మానాలను చేయడం జరిగింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.