Connect with us

Telangana

దేశంలో విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలి.. రాహుల్ గాంధీ పిలుపు

Published

on

హైదరాబాద్: విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు వికారాబాద్ లోని హరిత రిసార్ట్స్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల రాజకీయ శిక్షణ శిబిరం ముగింపు సభలో ఉద్వేగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కులమత రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు మనందరం సమిష్టిగా కృషి చేయాలని అలాగే మోడీని గద్దె దించే వరకు విశ్రమించరాదని, తమ తమ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని అవసరమైతే పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, తాను సైతం మీ ప్రాంతానికి వచ్చి మీతో కలిసి పోరాడుతామని ఆయన అన్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కలిసి తమ జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, సంస్థ గత నిర్మాణాన్ని గురించి వివరించారు. రాహుల్ గాంధీతో పాటు ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి, కేకేసి రాష్ట్ర చైర్మన్.. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి, కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ .సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పంతంగి పాలంక రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.