Connect with us

Telangana

అన్నా.. నన్ను కాపాడండి.. యాక్సిడెంట్ అయిన విద్యార్థిని వేడుకోలు

Published

on

TS: అన్నా మా ఇంటికి ఫోన్ చేయండన్నా.. నన్ను కాపాడండి అన్నా.. రోడ్డు ప్రమాదంలో లారీ టైర్ల మధ్యలో ఇరుక్కున్న ప్రాణాలు పోయే ముందు బీటెక్ విద్యార్థిని ఆర్తనాదాలు. బీటెక్ చదువుతున్న తన కూతురు మైత్రిని తండ్రి బైకుపై ఎక్కించుకుని కాలేజీకి బయలుదేరాడు. షాద్ నగర్ లో ట్యాంకర్ డీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన మచ్చేందర్.. అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కూతురు మైత్రి లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తీవ్రగాయాలపాలైన ఆమె.. బయటికి రాలేక విలవిల్లాడిపోయింది. చుట్టూ గుమికూడిన వారిని చూసి.. కాపాడండి.. అన్నా.. అంటూ కేకలు పెట్టింది. ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఆమె.. ఎలాగోలా తన ఫోన్ బయటికి తీసి అక్కడున్న వారికి ఇచ్చింది. మా ఇంటికి ఫోన్ చేయండి అన్నా.. అని కోరింది. ఇంతలో ఆమె ఫోన్కు ఫోన్లు రావడంతో స్థానికులు విషయం తెలియజేశారు. అయితే ఇంతలోనే మైత్రి కూడా తనువు చాలించింది. ప్రాణాలు పోయే ముందు ఆమె ఆర్తనాదాలు విని అంతా కంటతడి పెట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.