Telangana
అజారుద్దీన్ MLC నామినేషన్ వెనుకకు తీసుకోవాలి: ఎంపీజే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్
TG : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మరియు హైదరాబాద్ క్రీడా అథారిటీ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజారుద్దీన్‌ను ప్రభుత్వ కోటా కింద నామినేషన్ వేయడంపై తెలంగాణ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ అజీజ్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు హోదా మరియు గౌరవానికి ప్రాకులాడతారని అలాంటి వారిలో అజారుద్దీన్ ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ హజారుద్దీన్ కు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.ఆయన వెంటనే MLC నుండి తిరిగి వెనక్కి తగ్గడం అవసరం అని అన్నారు. క్రికెట్ ఐకాన్ గాఅజారుద్దీన్ పై వినయం మరియు గౌరవం ఎప్పుడూ తగ్గదని ఆయన పేర్కొన్నారు. ఆయనకు గవర్నర్ కోటాలో నామినేషన్ MLC పదవికి బదులుగా, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మరియు పార్లమెంట్ సభ్యులు ఐన మహమ్మద్ అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, గత సార్వత్రిక ఎన్నికల్లో అతని పనితీరు చాలా మెరుగ్గా ఉంది అని, ఈసారి పాలక కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నుండి అతని విజయాన్ని నిర్ధారించుకోవడం ఒక సవాలుగా తీసుకోవాలి పనిచేయాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ఆయన తిరస్కరించాలని తెలియజేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ,ముస్లిం సమస్యలపై గట్టిగా మాట్లాడే ఒక ముస్లిం నాయకుడిని అసెంబ్లీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సున్నితమైన సమయంలో, అసెంబ్లీకి నిజమైన ముస్లిం నాయకుడిని గుర్తించడంలో విఫలమైనందుకు పాలక కాంగ్రెస్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అబ్దుల్ అజీజ్ విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ, ముస్లింలు పార్టీకి 12-14 శాతం ఓట్లను వేసినప్పటికీ, వారికి టిక్కెట్లు టికెట్లు ఎందుకు ఇవ్వటం లేదో ముస్లింలకు అర్థం కావడం లేదని, ఇది స్పష్టమైన అన్యాయాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
![]()
