Telangana
ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి: సుప్రీం కోర్టు
TG:తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్లో ఉంచరాదని స్పష్టం చేసింది. అనర్హులుగా కోర్టే ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై ఈ తీర్పిచ్చింది.
మరోవైపు…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత కేసు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు కోర్టు తీర్పు, తర్వాత పార్టీ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు: దానం, అరికెపూడి గాంధీ,
తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, కడియం, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం, సంజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి
![]()
