Connect with us

World

ఘోర బస్సు ప్రమాదం – 42 మంది మృతి.. ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే..!

Published

on

మక్కా: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం భారతీయ ఉమ్రా యాత్రికులకు విషాదకరంగా మారింది. నవంబర్ 17, 2025న ఉదయం సుమారు 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మక్కాలో ఉమ్రా యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మృతులు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారు. బస్సులో ఉన్న యాత్రికులు చాలామంది నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.