Connect with us

Jobs

రాష్ట్రీయ ఉత్తమ అవార్డు అందుకున్న మహబూబ్ వలీ..

Published

on

న్యూఢిల్లీ: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢీల్లీలో ఎన్ డి ఎం సి కన్వెన్షన్ హాల్ లో రాష్ట్రీయ గౌరవ పురస్కారం అందుకున్న ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి. ఈ పురస్కారం తెలుగు రాష్ట్రాలనుండి ఎంపికైన ఏకైక వ్యక్తిగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి నిలిచారు. తనకు రాష్ట్ర గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు వైఎస్ఎస్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపిన మహబూబ్ వలీ. ఈ అవార్డు భారతదేశం అంతట 100 మందికి మాత్రమే ఎంపిక చేస్తారు. అందులో విద్య మరియు వైద్యం సామాజిక సేవలు మరియు యువ నాయకులకు ఈ అవార్డును ఇస్తారని ఆయన తెలిపారు. భారతదేశంలో ఇచ్చే గౌరవ పురస్కారాల్లో ఇది ఒక్కటి. ఇతను ఇరవై సంవత్సరాలు మిలటిరీలో దేశానికి సేవలు అందించారు. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇతను ప్రస్తుతం రిటైర్మెంట్ అనంతరం పలు సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ.. పేదలకు దానధర్మాలు చేస్తూ..మంచి పేరు గడించారు. రాజకీయాల్లో కూడా రాణిస్తూ, ప్రకాశం జిల్లా మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటం గమనార్హం. మహబూబ్ వలీ కు ఈ అవార్డు వచ్చినందుకు సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.