Connect with us

Gossips

నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందా?

Published

on

ఆమె రెండో వివాహానికి సిద్ధమవుతున్నారని చర్చ జరుగుతోంది. ఆమె మారు పెళ్లిపై తరచూ పుకార్లు నడుస్తున్నాయి. తాజాగా నిహారిక పంచుకున్న ఫొటో ఒకటి ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నిహారిక ఓ ఫొటో పంచుకుంది. ఆ ఫొటో చూస్తే ఏదో పూజనో లేదా నిశ్చితార్థం ఫొటోదిగా కనిపిస్తోంది. పట్టుచీర ధరించి.. చేతికి గోరింటాకు పెట్టుకుని.. మల్లె పూలతో కూర్చున్న ఫొటో నిహారిక స్టోరీగా పోస్టు చేసింది. ఆ ఫొటో చూస్తే నిహారిక నిశ్చితార్థం చేసుకున్నదనే చర్చ నడుస్తోంది. పూర్తి ఫొటో పోస్టు చేయకుండా కేవలం చేయి.. పూలు కనిపించేలా షేర్‌ చేసి నెటిజన్ల మెదడుకు పదును పెట్టింది. అది కచ్చితంగా నిశ్చితార్థం ఫొటో అని నెటిజన్లు, ఆమె అభిమానులు భావిస్తున్నారు.గతంలో వైవాహిక బంధం నిలవకపోవడంతో కొన్నాళ్లు ఆమె గ్యాప్‌ తీసుకున్నారు. మళ్లీ వివాహంపై దృష్టి సారించినట్లు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇటీవల తన నిర్మాణ సంస్ధ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో చండీ హోమం నిర్వహించిన ఫొటో ఒకటి చక్కర్లు కొట్టింది.

మొన్న పూజలు నిర్వహించగా తాజాగా సంప్రదాయ పద్ధతిలో కూర్చున్న ఫొటోను షేర్‌ చేయడం చూస్తుంటే నిహారిక నిశ్చితార్థం జరిగిందనే చర్చ జరుగుతోంది. పూజలు చేయడం.. తాజా ఫొటోతో ఆమె రెండో పెళ్లి ఖాయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే వాస్తవం ఏమిటనేది మాత్రం మెగా కుటుంబం నుంచే స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇతర భాషలో ఓ సినిమాతోపాటు తెలుగులో కొన్ని ప్రాజెక్టులతో నిహారిక బిజీగా ఉంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.